కరోనా నుంచి కోలుకుంటున్న శ్రీవారి ఆలయ అర్చకులు

ABN , First Publish Date - 2020-07-20T14:49:17+05:30 IST

కరోనా నుంచి కోలుకుంటున్న శ్రీవారి ఆలయ అర్చకులు

కరోనా నుంచి కోలుకుంటున్న శ్రీవారి ఆలయ అర్చకులు

తిరుమల: కరోనా బారిన పడిన శ్రీవారి ఆలయ అర్చకులు కోలుకుంటున్నారు. ఈ నెల 8న నలుగురు అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ముగ్గురు అర్చకులు కోలుకోవడంతో వైద్యులు వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అర్చకులకు వైద్యులు సూచించారు. దీంతో  కోవిడ్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న అర్చకుల సంఖ్య 14కు చేరుకుంది. చెన్నై అపోలో ఆస్పత్రిలో మరో అర్చకుడు చికిత్స పొందుతున్నారు. ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్సను అందజేస్తున్నారు. అర్చకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-07-20T14:49:17+05:30 IST