తుని ఘనలో మరో 17 కేసుల ఉపసంహరణ
ABN , First Publish Date - 2020-07-28T02:43:59+05:30 IST
తుని ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైలు ఘటనలో మరో 17 కేసుల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం

అమరావతి: తుని ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి తుని రైలు ఘటనలో మరో 17 కేసుల్లోనూ విచారణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు విడుదల చేశారు. డీజీపీ సిఫార్సుల మేరకు ఈ కేసులను ఉపసంహరిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, తుని ఘటనలో 69 కేసులు నమోదు కాగా, ఇప్పటికే 51 కేసులను ఉపసంహరించుకుంది.