‘ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి’
ABN , First Publish Date - 2020-04-29T00:22:57+05:30 IST
రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం

అమరావతి: రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పిడుగులు ఏ ఏ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందంటే..
ప్రకాశం జిల్లా: మార్కాపురం, తర్లుపాడు, అర్ధవీడు, కొనకనమిట్ల.
నెల్లూరు జిల్లా: నెల్లూరు, పొదలకూరు, చేజర్ల, కలువాయ, రాపూర్, బలయపల్లి, వెంకటగిరి, కలువాయి, ఓజిలి, గూడూరు, చిత్తమూరు, సైదాపురం, దక్కలి.
చిత్తూరు జిల్లా: చిత్తూరు, శ్రీకాళహస్తీ, తోట్టంబేడు, పాలసముద్రం, గంగాధరనెల్లూరు.
ఈ మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని అధికారులు ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.