మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం

ABN , First Publish Date - 2020-12-15T09:27:44+05:30 IST

‘‘మూడు రాజధానుల నిర్ణయాన్ని నిలువరించే చట్టాలేవీ లేవు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది.

మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం

హైకోర్టుకు తెలిపిన సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నఫాడే


అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘మూడు రాజధానుల నిర్ణయాన్ని నిలువరించే చట్టాలేవీ లేవు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లకు విచారణార్హత లేదు’’ అని సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నఫాడే హైకోర్టుకు వివరించారు. రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుదివిచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నఫాడే సోమవారం వాదనలు వినిపిస్తూ... అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడు రాజధానులతో ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. వారి హక్కులకు భంగం కలగదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. ఇదిలా వుండగా తదుపరి వాదనల కోసం విచారణ వాయిదా పడింది.

Updated Date - 2020-12-15T09:27:44+05:30 IST