ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరింపులు

ABN , First Publish Date - 2020-05-29T21:07:54+05:30 IST

ప్రేమించకపోతే ప్రెట్రోలు పోసి చంపుతామంటూ బెదిరింపులకు దిగారు.

ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరింపులు

తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం మండలం, రోళ్లపాలెంలో ఇద్దరు బాలికలను అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు ప్రేమ పేరుతో వేధించారు. ప్రేమించకపోతే ప్రెట్రోలు పోసి చంపుతామంటూ బెదిరింపులకు దిగారు. ఆకతాయిలు తమను వేధిస్తున్నారంటూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఆకతాయిలిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.


అయితే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారి తీరుమారలేదు. ఇంకా వెంటపడుతున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని బాలికలు ఆరోపించారు. వైసీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ భర్తే ఆకతాయిలను అరెస్టు చేయకుండా అడ్డుపడుతున్నారని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు. బాలికల తల్లి బతుకుతెరువు కోసం కువైట్‌లో ఉంటోంది. పోలీసులు న్యాయం చేయాలని ఆమె కువైట్ నుంచి వేడుకుంది. సమాజంలో ఆడపిల్లలు బతకడానికి స్వతంత్ర్యం లేదా? అని ఆమె ప్రశ్నించారు.

Updated Date - 2020-05-29T21:07:54+05:30 IST