ఆ ఐదు గ్రామాలు నిర్మానుష్యం

ABN , First Publish Date - 2020-05-09T10:10:35+05:30 IST

మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ సమీపంలోని గామ్రాలవి! అక్కడ ఎప్పుడూ ప్రశాంత వాతావరణమే! కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెలన్నరగా వీధులన్నీ బోసిపోయినా... ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు.

ఆ ఐదు గ్రామాలు నిర్మానుష్యం

ప్రతి ఇంటికీ తాళమే!


గోపాలపట్నం, మే 8: మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌ సమీపంలోని గామ్రాలవి! అక్కడ ఎప్పుడూ ప్రశాంత వాతావరణమే! కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెలన్నరగా వీధులన్నీ బోసిపోయినా... ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు. సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి నిత్యావసరాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు... ప్రతి ఇంటికీ తాళమే! ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌లీక్‌తో తలెత్తిన పరిస్థితి ఇది.


ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న వెంకటాపురం, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీలు, నందమూరి నగర్‌, కంపరపాలెం ప్రాంతాలు పూర్తి నిర్మానుష్యంగా మారాయి. గ్యాస్‌ లీకేజీ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని అధికారులు ప్రకటించడంతో శుక్రవారం కూడా ఎవ్వరూ గ్రామాల్లోకి రావడానికి సాహసించలేదు. దూరంగా ఉన్న బంధువుల ఇళ్లలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకే పరిమితమయ్యారు. 

Updated Date - 2020-05-09T10:10:35+05:30 IST