జగన్‌ శిక్షణ.. ఇలా సాగుతోంది: కాల్వ

ABN , First Publish Date - 2020-02-16T09:31:58+05:30 IST

‘‘కేంద్రం మెడలు వంచడంపై నిపుణుల దగ్గర జగన్‌ శిక్షణ ఇలా సాగుతోంది. ముందుగా మోకాలిపై పడాలి. ఆ తర్వాత ప్లీజ్‌ అనాలి. అనంతరం శాలువా కప్పి, సాష్టాంగ సమస్కారం చేయాలి.

జగన్‌ శిక్షణ.. ఇలా సాగుతోంది: కాల్వ

అమరావతి: ‘‘కేంద్రం మెడలు వంచడంపై నిపుణుల దగ్గర జగన్‌ శిక్షణ ఇలా సాగుతోంది. ముందుగా మోకాలిపై పడాలి. ఆ తర్వాత ప్లీజ్‌ అనాలి. అనంతరం శాలువా కప్పి, సాష్టాంగ సమస్కారం చేయాలి. ఉచిత శిక్షణ పొందగోరే వారు వైసీపీ కార్యాలయంలో సంప్రదించగలరు’’ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్వీట్‌ చేశారు. 


మెప్మాల ఆకలి కేకలు వినపడవా?: అనిత

‘‘ఓట్లేయక ముందు నేను విన్నాను, నేను ఉన్నానన్నారు. జీతాలివ్వక మెప్మా ఆర్‌పీలు వేస్తున్న ఆకలి కేకలు మీకు వినపడవు. ఉద్యోగాలు ఊడపీకేస్తున్నారని ఆందోళనకు దిగితే.. మగ పోలీసులతో ఈడ్చి పారేస్తుంటే మీరెక్కడున్నారు?’’ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-02-16T09:31:58+05:30 IST