-
-
Home » Andhra Pradesh » Thirumala Srivari Temple
-
18 గంటల అనంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయం
ABN , First Publish Date - 2020-06-22T09:18:35+05:30 IST
సూర్యగ్రహణం అనంతరం ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల, జూన్ 21: సూర్యగ్రహణం అనంతరం ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. సూర్యగ్రహణం కారణంగా శనివారం రాత్రి 8.30 గంటలకే శ్రీవారి ఆలయం తలుపులను మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు తిరిగి మహాద్వారం తెరిచి సుప్రభాతం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.
జీవకోటి ఆరోగ్యం కోసం ‘సూర్యగ్రహణ జపయజ్ఞం’
కరోనా వైరస్ నశించి, ప్రపంచంలోని సమస్త జీవకోటి ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధిస్తూ పుష్కరిణిలో ఆదివారం ‘రాహుగ్రహ చూడామణి సూర్యగ్రహణ జపయజ్ఞం’ నిర్వహించారు.