సీఐ వేధిస్తున్నారంటూ ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

ABN , First Publish Date - 2020-07-28T19:21:36+05:30 IST

పట్టాభిపురం సీఐ కల్యాణరాజు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని..

సీఐ వేధిస్తున్నారంటూ ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు

గుంటూరు: పట్టాభిపురం సీఐ కల్యాణరాజు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఉపేంద్ర అనే బాధితుడు అర్బన్ ఎస్పీని ఆశ్రయించాడు. ఆస్తి కోసం తన కూతురు, అల్లుడు వేధిస్తున్నారని న్యాయం చేయాలని పట్టాభిపురం పోలీసులను ఉపేంద్ర ఆశ్రయించాడు. అయితే సీఐ లంచం తీసుకుని తనను ఇబ్బందులపాలు చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. తన అల్లుడు, సీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకున్నాడు. 

Updated Date - 2020-07-28T19:21:36+05:30 IST