-
-
Home » Andhra Pradesh » The truck collided and caught fire
-
లారీని ఢీకొని అగ్నికి ఆహుతి
ABN , First Publish Date - 2020-12-28T09:43:49+05:30 IST
బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం
గుత్తిరూరల్, డిసెంబరు 27: బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించడంతో ఇద్దరూ అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని యంగిలిబండ గ్రామ శివారులో 67వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. యాడికి మండలం బోగాలకట్ట గ్రామానికి చెందిన రోషిరెడ్డి (65), నగరూరు వాసి నారాయణరెడ్డి (38) గుత్తిలోని బాట సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకుని బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. యంగిలిబండ గ్రామ శివారులోకి రాగానే వారి వాహనం ఎదరుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పేలి మంటలు ఎగసిపడ్డాయి. నారాయణ రెడ్డి, రోషి రెడ్డి ఈ మంటల్లో తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటలు అంటుకుని లారీ కూడా దగ్ధమైంది.