జి.మాడుగులలో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత
ABN , First Publish Date - 2020-12-30T07:55:12+05:30 IST
తూర్పు, ఈశాన్య గాలుల వల్ల రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది.
అమరావతి, విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): తూర్పు, ఈశాన్య గాలుల వల్ల రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంది. అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 1 డిగ్రీ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రులు చలిగాలులు పెరగడంతోపాటు పొగమంచు దట్టంగా కమ్ముతోంది. హైవేలు, తీరప్రాంతం, ఏజెన్సీల్లో చలి, మంచు అధికంగా ఉంటున్నాయి. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 5.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో చలి పెరిగే అవకాశముంది.