తల్లి చిత్రపటానికి అంత్యక్రియలు చేసిన కొడుకు
ABN , First Publish Date - 2020-08-16T20:02:06+05:30 IST
కాళ్ళ మండలం జువ్వలపాలెంలో తల్లి చిత్రపటానికి కొడుకు అంత్యక్రియలు చేశాడు.

ప.గో. జిల్లా: కాళ్ళ మండలం జువ్వలపాలెంలో తల్లి చిత్రపటానికి కొడుకు అంత్యక్రియలు చేశాడు. ఘాతల మేరీ(45) ఉపాధి కోసం ఆమె కువైట్‌కు వెళ్లి అక్కడే అనారోగ్యంతో మృతిచెందింది. కరోనా నేపథ్యంలో మృతదేహం స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఇక చేసేదిలేక మేరీ ఫొటోను శవపేటికలో ఉంచి శ్మశానంలో ప్రార్ధనలు చేశారు.