-
-
Home » Andhra Pradesh » The Rs 300 Darshan quota for the month of January was released today
-
జనవరి నెల రూ.300 దర్శన కోటా నేడు విడుదల
ABN , First Publish Date - 2020-12-30T09:21:43+05:30 IST
జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జనవరి 4 నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ అనే టీటీడీ వెబ్‌సైట్ ద్వారా భక్తులు తమకు కావాల్సిన తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబరు 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 2వ తేదీన 8వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.