నిజమైన వైఎస్సార్‌ సీపీ మాదే

ABN , First Publish Date - 2020-06-26T07:47:39+05:30 IST

రాష్ట్రంలో నిజమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమదేనని ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ జాతీయ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా, రాష్ట్ర ..

నిజమైన వైఎస్సార్‌ సీపీ మాదే

‘అన్న వైఎస్సార్‌ సీపీ’ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల ప్రకటన


కర్నూలు(అర్బన్‌), జూన్‌ 25: రాష్ట్రంలో నిజమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమదేనని ‘అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ జాతీయ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా, రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ సత్తార్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ పేరుతో ఉన్న ఏకైక పార్టీ తమదేనని, ప్రస్తుత సీఎం జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని వెల్లడించారు.


అధికార బలం ఉన్న ఆ పార్టీ నాయకులు తమ పార్టీ పేరును వాడుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి 2015లోనే ఫిర్యాదు చేయగా ఎక్కడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరు వాడుకోకూడదని ఆదేశాలు కూడా ఇచ్చిందని తెలిపారు. 2015లో రిజిస్టర్‌ అయిన పార్టీ తమదేనని, గత ఎన్నికల్లో పలు చోట్ల తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారని గుర్తు చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని వారు ఈ సందర్భంగా కోరారు.

Updated Date - 2020-06-26T07:47:39+05:30 IST