ఏపీలో అధికారపార్టీనేతల తీరుతో కలకలం..

ABN , First Publish Date - 2020-04-21T18:30:33+05:30 IST

కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ ఉపాధి కోల్పోయినవారు, పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.

ఏపీలో అధికారపార్టీనేతల తీరుతో కలకలం..

అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ ఉపాధి కోల్పోయినవారు, పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కోలేక పస్తులు ఉంటున్నారు. అలాంటివారిని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అదే పిలుపు ఇచ్చారు. ఎవరినీ పస్తులుంచకుండా.. వీలైనంతవరకు ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. అయితే ఇక్కడ నిబంధనలను ఖచ్చితంగా పాటించితీరాల్సిందే. లాక్ డౌన్ ఆంక్షలు ఉల్లంఘనకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సహాయం చేస్తున్నవారిపై ఉంది. కానీ విచిత్రం.. ఏపీలో కరోనా సహాయక చర్యలను అధికారపార్టీ నేతలు పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. భారీ జనసమీకరణ చేసి సరుకులు పంపిణీ చేస్తున్నారు. దీంతో సాయం తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ కనిపిస్తోందని విమర్ళలు వస్తున్నాయి.


కరోనా సాయం పేరుతో బయట జరిగే రేషన్ పంపిణీని తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇందుకు కారణం.. నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు.. మేలు కంటే ప్రమాదం జరుగుతుందనే కారణంతోనే.. కానీ ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పేదలకు పంచిపెడుతున్నామనే కారణంతో బహిరంగ సభల్లంటివే పెట్టేస్తున్నారు. జనాన్ని పోగేస్తున్నారు. ఇక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. లాక్ డౌన్ ఆంక్షలు యథేచ్ఛంగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. భౌతిక దూరం నిబంధనలు పట్టించుకోవడంలేదు. కొన్ని చోట్ల మాస్కులు, గ్లౌజులు ధరించే ఉదంతాలు లేవు. దీంతో ఏపీలో కరోనా వ్యాప్తి చెందుతోంది.

Updated Date - 2020-04-21T18:30:33+05:30 IST