విశాఖ జిల్లాలో వినాయక విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-11-27T09:56:26+05:30 IST

విశాఖ జిల్లాలోని కశింకోట మండలం తాళ్లపాలెం శివాలయ ప్రాంగణంలో వినాయక విగ్రహాన్ని గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

విశాఖ జిల్లాలో వినాయక విగ్రహం ధ్వంసం

కశింకోట (విశాఖపట్నం), నవంబరు 26: విశాఖ జిల్లాలోని కశింకోట మండలం తాళ్లపాలెం శివాలయ ప్రాంగణంలో వినాయక విగ్రహాన్ని గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ముక్కలుగా చేసి కింద పడేశారు. విషయం తెలుసుకున్న భక్తులు ఆలయం వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తంచేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొంతమంది వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం వెలిబుచ్చారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరపాలని కోరారు

Read more