కొవిడ్ బాధితుల ఆకలి కేకలు
ABN , First Publish Date - 2020-08-12T08:55:42+05:30 IST
: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో 300 మంది చికిత్స

తాడేపల్లిగూడెం, ఆగస్టు 11: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో 300 మంది చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం 11.30గంటలకు కూడా అల్పాహారం అందకపోవడంతో వీరంతా ఆకలితో అలమటించారు. మందులు సైతం సరఫరా చేయకపోవడంతో ఇద్దరు సొమ్మసిల్లి పడిపోయారు. కొవిడ్ కేర్ సెంటర్ నుంచి నిట్ ప్రహరీ బయటకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు.