మండలిలో హోంమంత్రి వ్యాఖ్యలు శోచనీయం
ABN , First Publish Date - 2020-12-05T09:29:18+05:30 IST
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం దొంగతనం చేశాడనే విధంగా హోంమంత్రి సుచరిత శాసనమండలిలో మాట్లాడటం శోచనీయమని అబ్దుల్ సలాం న్యాయపోరాట...

అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి
విజయవాడ సిటీ, డిసెంబరు 4: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం దొంగతనం చేశాడనే విధంగా హోంమంత్రి సుచరిత శాసనమండలిలో మాట్లాడటం శోచనీయమని అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ ఫారూఖ్ షిబ్లి అన్నారు. ఒక వ్యక్తి తన నిర్దోషిత్వాన్ని సమాజం ముందు నిరూపించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.