కరోనా రిపోర్టు కోసం వస్తే గుండె ఆగింది!

ABN , First Publish Date - 2020-04-25T09:25:11+05:30 IST

కరోనా పరీక్షల రిపోర్టు తీసుకోవడానికి రాజమహేంద్రవరం ఆస్పత్రికి వచ్చిన ఓ మునిసిపల్‌ ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. శక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కె.నరసింహమూర్తి (38) తూర్పు గోదావరి జిల్లా

కరోనా రిపోర్టు కోసం వస్తే గుండె ఆగింది!

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 24: కరోనా పరీక్షల రిపోర్టు తీసుకోవడానికి రాజమహేంద్రవరం ఆస్పత్రికి వచ్చిన ఓ మునిసిపల్‌ ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. శక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కె.నరసింహమూర్తి (38) తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మునిసిపాలిటిలో సీనియర్‌ అస్టిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన రోజూ కొవ్వూరు నుంచి రామచంద్రపురం వెళ్తారు. గురువారం రాజమహేంద్రవరం ఆస్పత్రికి వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టు కోసం మరునాడు రమ్మని వైద్యులు చెప్పడంతో మూర్తి శుక్రవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. రిపోర్టు నెగెటివ్‌ వచ్చిందని, మరేం భయంలేదంటూ వైద్యులు దానిని ఆయనకు అందజేశారు. అయితే, అప్పటి వరకు రిపోర్టు ఎలా వస్తుందో అని తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారో ఏమో... ఆస్పత్రిలోపల నుంచి బయటకు వస్తూ ఫోను మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. వైద్యులు వచ్చి పరీక్షించేటప్పటికే ఆయన గుండె ఆగి మృతి చెందారు. 

Updated Date - 2020-04-25T09:25:11+05:30 IST