ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలి: పవన్
ABN , First Publish Date - 2020-07-19T20:07:59+05:30 IST
కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని..

కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రభుత్వం అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. కుటుంబానికి రూ. కోటి పరిహారంతోపాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ పేరు వింటేనే వణికిపోతున్న సమయంలో ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ ఉద్యోగులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది సేవలు విస్మరించలేనివని అన్నారు. వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు వస్తూ కరోనా బారిన పడుతున్నారని, వారికి నాలుగు వారాలపాటు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని జనసేనాని అన్నారు.