చచ్చిపోతున్నాం సర్.. త్వరగా రండి!
ABN , First Publish Date - 2020-05-09T10:25:49+05:30 IST
‘సార్..! గోపాలపట్నం దగ్గర వెంకట్రాది గార్డెన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ కంపెనీ గ్యాస్ పీల్చాము సార్.
3.25 గంటలకు కంట్రోల్‌రూమ్‌కు తొలి ఫోన్
విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):‘సార్..! గోపాలపట్నం దగ్గర వెంకట్రాది గార్డెన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ కంపెనీ గ్యాస్ పీల్చాము సార్. ఏదో అయిపోతోంది. చచ్చిపోతాం. త్వరగా వచ్చి రక్షించండి సార్...’’ అంటూ సుధాకర్ అనే యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ 100 నంబర్‌కు గురువారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఫోన్ చేశాడు. ప్రమాద ఘటనపై పోలీసులకు వచ్చిన మొదటి కాల్ అదే. కంట్రోల్ రూమ్ సిబ్బందికి మొదట ఆ యువకుడు చెప్పింది అర్థం కాలేదు. గ్యాస్ పీల్చి.. ఆయాస పడుతూ మాట్లాడడం వల్ల తాను త్వర త్వరగా మాట్లాడలేకపోయాడు. తాము ప్రమాదంలో ఉన్నామని, చచ్చిపోతున్నామని కూడా చెప్పా డు. సుమారుగా 35 సెకండ్లు మాత్రమే మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడు కానీ చేయలేదు