ఏపీలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం: అమరాతి జేఏసీ

ABN , First Publish Date - 2020-06-19T20:55:29+05:30 IST

ప్రజావ్యతిరేక విధానాలపై ఏపీ పరిరక్షణా సమితి పోరాటం చేస్తుందని అమరావతి జేఏసీ నేతలు అన్నారు.

ఏపీలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం: అమరాతి జేఏసీ

విజయవాడ: ప్రజావ్యతిరేక విధానాలపై ఏపీ పరిరక్షణా సమితి పోరాటం చేస్తుందని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా,  రాష్ట్ర విభజన హామీలు, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే కీలక డిమాండ్లతో ముందుకు వెళతామని అన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేత రామకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండిగా ముందుకు వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు కూడా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు.


ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వ్యవహరించినా దీర్ఘకాలంగా కొనసాగలేదని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. సీఎం చట్టాన్ని ధిక్కరిస్తున్నారని విమర్శించారు. సీఆర్డీయే, మూడు రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీలో ఉన్నాయని కోర్టులో అంగీకరించి.. ఇప్పుడు మళ్లీ ఆ బిల్లులపై తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2020-06-19T20:55:29+05:30 IST