నెల్లూరు జిల్లా ఉదయగిరిలో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2020-07-27T22:01:47+05:30 IST
ఉదయగిరిలోని కావలి రోడ్డు వెంబడి అటవీ ప్రాంతంలో కొందరు అగంతకులు..

నెల్లూరు జిల్లా: ఉదయగిరిలోని కావలి రోడ్డు వెంబడి అటవీ ప్రాంతంలో కొందరు అగంతకులు క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది. అర్థరాత్రి సమయంలో స్త్రీ ఆకారంలో ముగ్గు బొమ్మ వేశారు. ఆ బొమ్మ నడిమధ్యన యువతి ఫోటో ఉంచి క్షుద్రపూజలు చేశారు. పసుపు, కుంకుమ, గుమ్మడికాయ, కొబ్బరికాయలు, సాంబ్రాణి, కర్పూరం ఇవన్నీ క్షుద్ర పూజల్లో వినియోగించారు.
మేకలు కాస్తూ అటుగా వెళ్లిన కాపరులకి క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. దాంతో వారు జేవీవీ నేతలకు సమాచారం అందించారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఉదయగిరి వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సంచరిస్తూ క్షుద్రపూజలు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.