గ్యాస్‌ లీక్‌పై కేంద్ర బృందం దర్యాప్తు

ABN , First Publish Date - 2020-05-10T10:38:04+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యుల కమిటీ దర్యాప్తు ప్రారంభించింది.

గ్యాస్‌ లీక్‌పై కేంద్ర బృందం దర్యాప్తు

  • మరో 2 కమిటీలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం

విశాఖపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యుల కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. సంతాను గీతా(ముంబైకి చెందిన సుప్రీం పెట్రో కెమికల్స్‌ ప్రతినిధి), అంజన్‌రాయ్‌(డైరెక్టర్‌, ఢిల్లీ ఐఐపీ) శనివారం కంపెనీని సందర్శించారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకు పరిసరాలను పరిశీలించిన కమిటీ సభ్యులు కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ట్యాంకు నుంచి లీకేజీ అరికట్టడానికి సూచనలు చేశారు. వీరు ఆదివారం మరోసారి కంపెనీతోపాటు పరిసర గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఇదిలావుంటే, కంపెనీలో తాజా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అంతర్గత, అకడమిక్‌ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫ్యాక్టరీస్‌ డైరెక్టర్‌ డి.చంద్రశేఖరవర్మ నేతృత్వంలో ఎల్‌జీ పాలిమర్స్‌ రిటైర్డు డైరెక్టర్‌ ప్రవీణ్‌, సాంకేతిక నిపుణుడు అనంతరామగజపతి, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ కేబీఎస్‌ ప్రసాద్‌ సభ్యులుగా ఉంటారు. అకడమిక్‌ కమిటీలో ఆంధ్ర వర్సిటీ నుంచి నిపుణులను నియమించారు. ఈ బృందానికి తిరుపతిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి సహకరిస్తుంది. 

Updated Date - 2020-05-10T10:38:04+05:30 IST