ప్రతి పొలానికీ ‘కేంద్రం’ నీళ్లు
ABN , First Publish Date - 2020-12-30T08:38:12+05:30 IST
ప్రతి పొలానికీ నీరందించేందుకు ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి పొలానికీ నీరందించేందుకు ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రయోగాత్మకంగా ప్రకాశం జిల్లాలో 69.75 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పరిపాలనానుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.