వైసీపీతో పొత్తు పెట్టుకుంటే.. బీజేపీకి రాం రాం!

ABN , First Publish Date - 2020-02-16T09:16:52+05:30 IST

బీజేపీతో వైసీపీకి ఎలాంటి పొత్తూ లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండదని

వైసీపీతో పొత్తు పెట్టుకుంటే.. బీజేపీకి రాం రాం!

ఆ పార్టీల మధ్య చెలిమి లేదు

ఇదంతా వైసీపీ సృష్టే: పవన్‌ కల్యాణ్‌ 

గుంటూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీతో వైసీపీకి ఎలాంటి పొత్తూ లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండదని తేల్చిచెప్పారు. రాజధాని అమరావతి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేంద్రంలో చేరతామని వైసీపీ వాళ్లు మభ్యపెడుతున్నారు. బీజేపీలో వైసీపీ కలిసే పరిస్థితే లేదు. ఇవన్నీ వైసీపీ సృష్టిస్తున్నవే. ఇది అబద్ధం.. పచ్చి బూటకం’ అని చెప్పారు. మూడు రాజధానుల అంశం సమ్మతం కాదని కేంద్ర పెద్దలు తనకు చెప్పారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడే దీనిపై స్పష్టత తీసుకున్నానని తెలిపారు.  అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని చెప్పారు.

Updated Date - 2020-02-16T09:16:52+05:30 IST