నియమావళి ఉల్లంఘన తప్ప ఏసీబీ ఏమీ తేల్చలేదు
ABN , First Publish Date - 2020-10-03T07:32:01+05:30 IST
రాష్ట్ర అవినీతి నిరోధ క విభాగం(ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సంజాయిసీ నోటీసు ఇచ్చి వివరణ కోరడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.

ఏబీవీని విచారించే అధికారం డిప్యూటీ డైరెక్టర్‌కు లేదు
ఏబీవీది క్రిమినల్ ప్రవర్తన కాదు
అరెస్టులో.. సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే
తీర్పులో హైకోర్టు స్పష్టీకరణ
అరెస్టుపై ఆందోళనుంటే.. ముందస్తు బెయిల్ కోరండి
వెంకటేశ్వరరావుకు న్యాయమూర్తి సూచన
అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవినీతి నిరోధ క విభాగం(ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సంజాయిసీ నోటీసు ఇచ్చి వివరణ కోరడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ప్రవర్తనా నియమావళి వ్యవహారంలో ఆయనపై విచారణ జరి పే అధికారం ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌కు లేదని స్ప ష్టం చేసింది. ఇప్పటి వకూ అఖిల భారత సర్వీసు ల నిబంధనల ఉల్లంఘనల వ్యవహారంలో విచారణలు జరిగాయని.. కానీ నేరపూరిత దుష్ప్రవర్తన (క్రిమినల్ మిస్‌కాండక్ట్) కోణంలో జరగలేదని పే ర్కొంది. ఏబీవీ వ్యవహారంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన తప్ప మరే అంశాలనూ ఏసీబీ తే ల్చలేకపోయిందని, అలాంటప్పుడు ఆయ న్ను అరెస్టు చేయలేరని తేల్చిచెప్పింది.
కుటుంబ సభ్యుల వ్యక్తిగత ప్రయోజనాలను బహిర్గతం చే యకుండా రక్షణ పరికరాలు కొనుగోలు ప్రక్రియలో ఆయన పాల్గొనడం దుష్ప్రవర్తన అవుతుందే తప్ప.. ప్రాథమికంగా చూస్తే అది క్రిమినల్ ప్రవర్తన కింద కు రాదని తీర్పులో పేర్కొంది. రక్షణ పరికరాల కొ నుగోళ్ల వ్యవహారంలో తనను అరెస్టు చేయకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎలాంటి కే సూ నమోదు కాలేదని, ఒకవేళ ఏదైనా కేసు నమోదు చేసేటట్లయితే నిబంధనల మేరకు నడచుకుంటామన్న అడ్వకేట్ జనర ల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి.. ఆయన పిటిషన్‌ను కొట్టివేశారు. ఆ తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా ఉన్న పిటిషనర్.. విధుల్లో భాగంగా రాష్ట్ర పరిస్థితులపై సీఎంతో పాటు మంత్రుల కు కూడా వివరించారు. కొన్నిమార్లు రాజకీయ ప్రత్యర్థుల గు రించి కూడా సమాచారం ఇచ్చి ఉండొచ్చు.. ఇది ప్రతిపక్షాలకు అసంతృప్తి కలిగించి ఉండొచ్చు. ప్రతిపక్షంగా ఉ న్న పార్టీ అధికారంలోకి రాగానే తమ అధికారాన్ని వినియోగి స్తూ దర్యాప్తు తదితరాలకు పాల్పడే అవకాశముంది. ఇదీ అలాంటి సంఘటనేనని అనిపిస్తోంది’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
జీవించే హక్కును హరించడమే..
ప్రాసిక్యూషన్‌కు ఎలాంటి ఆధారం లేకుండా ఒక వ్యక్తిని ఏకపక్షంగా అరెస్టు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమ ని, అధికారం ఉన్నంత మాత్రాన ఎవరినైనా అరెస్టు చేయలేరని హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు వ్యవహారంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని, స దరు వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించేందు కు అధికారాన్ని ప్రయోగించరాదని తేల్చిచెప్పిం ది.
ప్రాథమిక ఆధారాలు లేకుండా ఇప్పటి వర కూ చేసిన విచారణ మేరకు.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఏబీవీని అరెస్టు చేస్తే అది అధికరణ 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కును హరించడమేనని పేర్కొంది. ఏసీబీ విచారణ నివేదిక ఆధారంగా పిటిషనర్‌ను అరె స్టు చేయబోమన్న అడ్వకేట్ జనరల్ వివరణను పరిగణనలోకి తీసుకుంటూ.. ఒకవేళ పిటిషనర్‌కు అరెస్టుపై ఆందోళనుంటే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు.
ఒకవేళ ప్రభుత్వం తగిన కారణాలతో నిర్ణయం తీసుకుంటే ‘అర్నేశ్‌కుమార్ వర్సెస్ బిహార్’ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలన్నారు.