మృతులు 11 మంది

ABN , First Publish Date - 2020-05-08T10:39:31+05:30 IST

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో 316 మంది నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మృతులు 11 మంది

ఆస్పత్రుల్లో మరో 316 మంది


విశాఖపట్నం, మే 7(ఆంధ్రజ్యోతి): విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మృతుల సంఖ్య 11కు  చేరింది. మరో 316 మంది నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 193 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, అందులో 44 మంది చిన్నారులు. అలాగే కేర్‌ ఆస్పత్రిలో 18 మంది, సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో నలుగురు, క్యూ 1 ఆస్పత్రిలో ముగ్గురు, ఆరిలోవ మెడ్‌ సిటీ అపోలో ఆస్పత్రిలో 28 మంది, ఎంబీ హాస్పిటల్‌లో 12 మంది, పినాకిల్‌లో ఒకరు, గోపాలపట్నం సీహెచ్‌సీలో 32 మంది, పెందుర్తి సీహెచ్‌సీలో 25 మంది చికిత్స పొందుతున్నారు.


మృతులు వీరే..

వై.అప్పలనరసమ్మ(45) 

గండిబోయిన 

కుందన శ్రేయ(6)

ఆర్‌.నారాయణమ్మ(35)

నాగులాపల్లి గ్రీష్మ(9)

మేకా కృష్ణమూర్తి(73)

ఎన్‌.నాని(30)

వి.నూకరాజు(60)

పైనాపిల్‌ వరలక్ష్మి(38) 

అన్నెపు చంద్రమౌళి(19)

సీహెచ్‌ గంగరాజు(48) 

తాపీ మేస్ర్తి, వెంకటాపురం

పిశంకరరావు(40) 

తాపీమేస్ర్తి, వెంకటాపురం

Updated Date - 2020-05-08T10:39:31+05:30 IST