సరిహద్దుల్లోనే పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-10T09:49:49+05:30 IST

బయట రాష్ట్రాల నుంచి వస్తున్న వలసకార్మికులు, ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సరిహద్దుల్లోనే కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జగన్‌

సరిహద్దుల్లోనే పరీక్షలు

ఆ తర్వాతే వలస కూలీలకు అనుమతి : సీఎం ఆదేశం


అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): బయట రాష్ట్రాల నుంచి వస్తున్న వలసకార్మికులు, ప్రజలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సరిహద్దుల్లోనే కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పరీక్షలు చేయించుకోకుండానే స్వస్థలాలకు వెళ్లినట్టు గుర్తించిన 700 మంది వలస కూలీలకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. చెన్నై కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన రైతులు, ఇతరులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షను చేపట్టారు. కొవిడ్‌తో మరణాలు లేకుండా మంచి వైద్యాన్ని అందించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  

Updated Date - 2020-05-10T09:49:49+05:30 IST