ఆకాశవాణిలో ఇప్పుడు పదోతరగతి పాఠాలు!
ABN , First Publish Date - 2020-04-21T10:31:18+05:30 IST
రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం(ఈ నెల 22) నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర

అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం(ఈ నెల 22) నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దూరదర్శన్ సప్తగిరి చానెల్ ద్వారా ‘విద్యామృతం’ పేరిట పాఠాలు బోధిస్తున్నారు. అయితే, రేడియోలో కూడా రోజూ ఉదయం 11.05 నుంచి 11.35 నిమిషాల వరకు(అరగంట) పదో తరగతి పాఠాల బోధన, పరీక్షల సన్నద్ధతపై కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు.