ఆశా వర్కర్ల ధర్నాలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-11-06T09:37:06+05:30 IST

గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఆశా వర్కర్లు తలపెట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య తీవ్రతోపులాట

ఆశా వర్కర్ల ధర్నాలో ఉద్రిక్తత

గుంటూరు తూర్పు: గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట గురువారం ఆశా వర్కర్లు తలపెట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య తీవ్రతోపులాట జరిగింది. దీంతో ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అరెస్టులకు నిరసనగా మరోసారి ఆశా వర్కర్లు అందోళనకు దిగడంతో.. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతినిచ్చారు. 


Updated Date - 2020-11-06T09:37:06+05:30 IST