శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2020-09-20T17:54:43+05:30 IST

శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్‌ టెన్షన్‌

కర్నూలు: శ్రీశైలం దేవస్థానంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై శ్రీశైలం ఆలయ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన వారిని బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చారు. అయితే దర్శనం టైం అయిపోయిందని సిబ్బంది చెప్పటంతో వాగ్వాదం నెలకొంది.


ఈ నేపథ్యంలో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో తమపై దాడి చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు హైకమాండ్‌కు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం ఆలయం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్, ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. గొడవకు కారణాలపై డీఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో విచారణ జరుగుతోంది.

Updated Date - 2020-09-20T17:54:43+05:30 IST