నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-03T23:28:26+05:30 IST

నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వచ్చారు. అయితే అదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

శ్రీకాకుళం: నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు వచ్చారు. అయితే అదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అశోక్‌ను పోలీసులు గేటు దగ్గర ఆపేశారు. అంతేకాదు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును బయటకు వెళ్లిపోమన్నారు. మాజీ హోంమంత్రిని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోవాలనడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు దగ్గరే ఫిర్యాదు ఇచ్చిపోవాలని పోలీసులు చెప్పారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు బైఠాయించారు.

Updated Date - 2020-10-03T23:28:26+05:30 IST