మంత్రి బొత్స ఇంటివద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-10-13T20:43:24+05:30 IST

మంత్రి బొత్స సత్యానారాయణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

మంత్రి బొత్స ఇంటివద్ద ఉద్రిక్తత

విజయనగరం: మంత్రి బొత్స సత్యానారాయణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి ఇల్లు ముట్టడికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎంఆర్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని మాన్సాస్ ఛైర్మన్ సంచయిత తీసుకున్న నిర్ణయంతో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి బొత్సాకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే పోలీసులు తమను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమ నిరంకుశ వైఖరిని చాటుకుంటుందని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మండిపడ్డారు. ఈ అరెస్టులు ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని ఆపలేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ విషయమై సంచయితకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని, ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని, ఆమె వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్టు భ్రష్టుపట్టిపోయిందని ఆరోపించారు. 

Updated Date - 2020-10-13T20:43:24+05:30 IST