చర్చి నిర్మాణానికి టెండర్లు రాజ్యాంగ ఉల్లంఘనే: ఎంపీ రఘురామరాజు

ABN , First Publish Date - 2020-12-11T08:04:51+05:30 IST

‘‘గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌ రొంపిచర్ల గ్రామంలో చర్చి నిర్మాణం కోసం టెండర్లను పిలిచారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన.

చర్చి నిర్మాణానికి టెండర్లు రాజ్యాంగ ఉల్లంఘనే: ఎంపీ రఘురామరాజు

అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌ రొంపిచర్ల గ్రామంలో చర్చి నిర్మాణం కోసం టెండర్లను పిలిచారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ప్రభుత్వం మత అంశాలను ప్రచారం చేయడం చట్టరీత్యా సరికాదు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు.  రాజ్యాంగాన్ని కించపరుస్తూ, క్రైస్తవం కోసం ప్రభుత్వం పరిధి దాటుతోందన్నారు. సీఎంకి జీసస్‌ మీద ఉన్న విశ్వాసంతో డిసెంబరు 25న, క్రీస్తు పుట్టిన రోజునాడే రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమయ్యారన్నారు.  

Updated Date - 2020-12-11T08:04:51+05:30 IST