ఆలయాల మూసివేత కాదు

ABN , First Publish Date - 2020-03-21T09:21:03+05:30 IST

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోకి భక్తులను అనుమతించ డం లేదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దేవుడికి నిత్యం చేసే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతాయన్నా రు. ఇది ఆలయాల

ఆలయాల మూసివేత కాదు

  • భక్తులను అనుమతించడం లేదు: వెలంపల్లి 

అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోకి భక్తులను అనుమతించ డం లేదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దేవుడికి నిత్యం చేసే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతాయన్నా రు. ఇది ఆలయాల మూసివేత కాదని, కేవలం భక్తులను అనుమతించకపోవడమేనన్నారు. అ వకాశం ఉన్నచోట ఆలయాల్లో జరిపే సేవలను టీవీల్లో ప్రసారం చేస్తారని తెలిపారు. భక్తులు స్వచ్ఛందంగా దర్శనాలు వాయిదా వేసుకోవాల ని కోరారు. 31వరకూ ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సూచించిన విధం గా అనారోగ్య నివారణ జపహోమాదులు, పా రాయణలు నిర్వహించాలని అధికారులకు సూ చించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-03-21T09:21:03+05:30 IST