ప్రభుత్వ ఆఫీసుల్లో ‘పదకోశం.. మీకోసం’
ABN , First Publish Date - 2020-10-21T08:32:21+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చేసేందుకు ‘పదకోశం.. మీకోసం’ పేరిట నిఘంటువులు ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చేసేందుకు ‘పదకోశం.. మీకోసం’ పేరిట నిఘంటువులు ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని అధికార భాషా సంఘం నిర్ణయించింది. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యున్నత కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక సీఎస్ రజత్ భార్గవ ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సభ్యులు హాజరయ్యారు.