సీమ ప్రాజెక్టుకు అభ్యంతరాలపై సమాధానమేంటి?

ABN , First Publish Date - 2020-08-11T08:42:55+05:30 IST

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించాలని తెలంగాణలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా

సీమ ప్రాజెక్టుకు అభ్యంతరాలపై సమాధానమేంటి?

  • ఆంధ్రాను కోరిన తెలంగాణ హైకోర్టు

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించాలని తెలంగాణలోని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఆ రాష్ట్రానికి చెందిన శోభన్‌బాబు వేసిన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది ఈ పథకానికి వ్యతిరేకంగా కేసులు నమోదవుతాయని ముందస్తుగా ఊహించిన ఏపీ జల వనరుల శాఖ తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేవియట్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకే తెలంగాణ హైకోర్టు దానిని వివరణ కోరింది. సమాధానమిచ్చేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది.

Updated Date - 2020-08-11T08:42:55+05:30 IST