తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి: జగన్

ABN , First Publish Date - 2020-05-11T00:02:04+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన జీవో కాబట్టి.. తీర్పు ప్రభావం ఇరురాష్ట్రాలపై ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు.

తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి: జగన్

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన జీవో కాబట్టి.. తీర్పు ప్రభావం ఇరురాష్ట్రాలపై ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు.  జీవో నెం.3ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో అడ్వకేట్‌ జనరల్‌తో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎస్టీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో రిజర్వేషన్ల జీవోను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొందని మంత్రి పుష్పశ్రీవాణి సీఎం దృష్టికి తెచ్చారు. గిరిజనుల ప్రయోజనాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-05-11T00:02:04+05:30 IST