రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-10-21T22:25:02+05:30 IST

రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

అమరావతి: తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు చేసింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుధీర్‌బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. ఈ నేపథ్యంలో సుధీర్‌బాబు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. భూ రికార్డులు తారుమారు రాజధానిలోని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనపై సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ సుధీర్‌బాబు హైకోర్టులో దాఖలు చేసుకున్నారు. ఈ కేసులో సుధీర్‌బాబుతో పాలు విజయవాడుకు చెందిన సురేష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-10-21T22:25:02+05:30 IST