కదంతొక్కిన ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2020-03-04T07:19:39+05:30 IST

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని జగన్‌ నిలబెట్టుకోవాలని, 11వ పీఆర్‌సీని అమలు చేయాలని...

కదంతొక్కిన ఉపాధ్యాయులు

సీపీఎస్‌ రద్దు.. 11వ పీఆర్‌సీ అమలుకు డిమాండ్‌

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని జగన్‌ నిలబెట్టుకోవాలని, 11వ పీఆర్‌సీని అమలు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు మంగళవారం జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించారు. డీఏ బకాయిలు చెల్లించేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని నినదించారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు ఒంగోలులో, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సాబ్జీ, ఎమ్మెల్సీ రాము సూర్యారావు ఏలూరులో పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిస్తామని చెప్పారు.

Updated Date - 2020-03-04T07:19:39+05:30 IST