టీడీపీ, వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం

ABN , First Publish Date - 2020-03-16T17:32:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

టీడీపీ, వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం

న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టీడీపీ తరఫున వర్ల రామయ్య.. వైసీపీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఐదుగురి నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. నామినేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటంతో ఐదుగురి నామినేషన్లను ఆమోదించడం జరిగింది.

Updated Date - 2020-03-16T17:32:30+05:30 IST