‘తూర్పు’న దౌర్జన్యాలు, బెదిరింపులు

ABN , First Publish Date - 2020-03-12T10:43:05+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున శీరంరెడ్డి సీతాలక్ష్మి నామినేషన్‌

‘తూర్పు’న దౌర్జన్యాలు, బెదిరింపులు

కాకినాడ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున శీరంరెడ్డి సీతాలక్ష్మి నామినేషన్‌ వేయడానికి రాగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వెంట వచ్చిన నేతలను పోలీసుల ఎదుటే చితకబాదారు. ఆమె చేతిలో నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించిపారేశారు. పెదపూడి మండలం పెద్దాడ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి నామినేషన్‌ వేసేందుకు రాగా, వైసీపీ నేతలు అడ్డుకుని రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో మరో వ్యక్తితో పత్రాలు లోపలకు పంపించారు. తొండంగి మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నేమాల నూకరాజు నామినేషన్‌ పత్రాలను వైసీపీ నేతలు లాక్కొని చించేశారు. కరప మండలం నడకుదురు-1 జనసేన అభ్యర్థి భాస్కరరావును వైసీపీ నేతలు బెదిరించడంతో నామినేషన్‌ వేయకుండా వెనుదిరిగారు. 


Updated Date - 2020-03-12T10:43:05+05:30 IST