బీసీలపై హత్యా రాజకీయాలను తక్షణం ఆపాలి: ఎమ్మెల్సీ తిప్పేస్వామి

ABN , First Publish Date - 2020-12-30T23:17:10+05:30 IST

బీసీలపై హత్యా రాజకీయాలను తక్షణం ఆపాలి: ఎమ్మెల్సీ తిప్పేస్వామి

బీసీలపై హత్యా రాజకీయాలను తక్షణం ఆపాలి: ఎమ్మెల్సీ తిప్పేస్వామి

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. కడప జిల్లా పొద్దుటూరులో బీసీ నేత సుబ్బయ్య దారుణ హత్యను తిప్పేస్వామి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 19 నెలల సమయంలో అనేక మంది టీడీపీ సానుభూతిపరులు, నాయకులను హత్య చేయడం ప్రభుత్వం చేతగానితనంగా ఆయన అభివర్ణించారు. గత 19 నెలల కాలంలో రాష్ట్రంలో దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ పక్కహత్యా రాజకీయాలు మరోపక్క ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్సీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి డిమాండ్ చేశారు.


సుబ్బయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమయ్యిందని, పోలీసులు వైసీపీ నేతలకు గుండాలుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని తిప్పేస్వామి అన్నారు.  ఇందుకు తాడిపత్రిలో అదికార పార్టీ ఎమ్మేల్యే వ్యవహరించిన తీరే నిదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ర్టంలో అటవిక పాలన రాజ్యమేలుతోందని, హత్యరాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ నిదర్శనంగా నిలుస్తొందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని, రాజకీయహత్యలను నిలువరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హెచ్చరించారు.

Updated Date - 2020-12-30T23:17:10+05:30 IST