సీఎం జగన్ రాష్ట్రాన్ని ముగ్గురికి అప్పగించారు: కాల్వ శ్రీనివాసులు

ABN , First Publish Date - 2020-08-11T22:05:56+05:30 IST

సీఎం జగన్ రాష్ట్రాన్ని ముగ్గురికి అప్పగించారు: కాల్వ శ్రీనివాసులు

సీఎం జగన్ రాష్ట్రాన్ని ముగ్గురికి అప్పగించారు: కాల్వ శ్రీనివాసులు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని మూడుప్రాంతాలుగా విభజించి ముగ్గురికి అప్పగించారని, ఆ ముగ్గురూ జగన్ సామాజికవర్గం వారే అని కాల్వ విమర్శించారు. వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వంలో, పార్టీలో ఎవరూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలేదని మండిపడ్డారు. దళితులు, బీసీలకు జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేదని, ముగ్గురు వ్యక్తులు సర్వం తామై వ్యవహరిస్తున్నప్పుడు దళితులు, బీసీలకు ప్రభుత్వంలో, పార్టీలో ఎటువంటిస్థానం ఉంటుందో ఆయావర్గాలు ఆలోచించాలని కాల్వ అన్నారు. 2014-2019 మధ్యకాలం రాయలసీమకు స్వర్ణయుగమని, చంద్రబాబు నాయుడు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడానికి కంకణబద్ధుడై పనిచేశాడన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, గాలేరు-నగరి, ముచ్చుమర్రి, గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం, భైరవాని తిప్ప ప్రాజెక్ట్, వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం వంటివన్నీ పూర్తయ్యాయని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. 


Updated Date - 2020-08-11T22:05:56+05:30 IST