టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం
ABN , First Publish Date - 2020-12-02T00:42:15+05:30 IST
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం

అమరావతి: టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. మార్షల్స్‌పై పలువురు టీడీపీ సభ్యులు దాడి చేశారని వైసీపీ సభ్యులు పేర్కొన్నారు. మార్షల్స్‌పై సాంబశివరావు, అనగాని, గొట్టిపాటి దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవరిస్తున్నారని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. టీడీపీ తీరుపై వైసీపీ స్పీకరుకు ఫిర్యాదు చేసింది. మార్షల్స్ నుంచి స్పీకర్ పేషీ సమాచారం తీసుకున్నారు. అలాగే మార్షల్స్ తీరుపై స్పీకరుకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ పేర్కొంది.