లిక్కర్‌ కింగ్‌ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు: యరపతినేని

ABN , First Publish Date - 2020-04-26T19:04:38+05:30 IST

రాష్ట్రంలో సారా, గుట్కా, కైనీ, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు.

లిక్కర్‌ కింగ్‌ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు: యరపతినేని

అమరావతి: రాష్ట్రంలో సారా, గుట్కా, కైనీ, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఈ విషయం వైసీపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కేసులు ఎందుకు పెట్టడంలేదన్నారు. లిక్కర్‌ కింగ్‌ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు, ఆయన కనుసన్నల్లోనే వ్యాపారం జరగుతుందని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వేల కోట్లు ఆర్జిస్తున్నారని చెప్పారు. కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సలహాలు అవసరంలేదనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-04-26T19:04:38+05:30 IST