స్పీకర్ గా ఉండి వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలది: మంత్రి అనిల్

ABN , First Publish Date - 2020-06-18T23:26:37+05:30 IST

స్పీకర్ గా ఉండి వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలది: మంత్రి అనిల్

స్పీకర్ గా ఉండి వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలది: మంత్రి అనిల్

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. కౌన్సిల్లో ఇష్టం వచ్చినట్లు చేస్తామని, విధ్వంసం సృష్టిస్తామని యనమల అన్నారని మండిపడ్డారు. స్పీకర్ గా ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర యనమలది అని అనిల్ కుమార్ విమర్శించారు. తనలాగే స్పీకర్ పదవుల్లో ఉన్న వారు కూడా చరిత్రహీనులు కావాలని యనమల కోరుకుంటున్నాడని, అందుకే కౌన్సిల్ లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లతో యనమల తప్పు మీద తప్పులు చేయిస్తున్నాడని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించనివ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా కౌన్సిల్ లో తెలుగుదేశం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. కౌన్సిల్ లో టీడీపీకి సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటామని, ఏమైనా చేస్తామనే తీరుగా టీడీపీ సభ్యులు వ్యవహరించారని మంత్రి అనిల్ మండిపడ్డారు. కోవిడ్ -19 కారణంగా బడ్జెట్ సమావేశాలను తక్కువ సమయంలోనే పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం భావించిందని మంత్రి చెప్పారు.

Updated Date - 2020-06-18T23:26:37+05:30 IST