కర్నూలు: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-30T15:11:31+05:30 IST

కర్నూలు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

కర్నూలు: టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు: జిల్లాలోని శిరువెళ్ళ  మండలం మోతకలపల్లే గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇళ్ల పట్టాల వ్యవహారమే ఘర్షణకు కారణంగా తెలియవచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2020-12-30T15:11:31+05:30 IST