విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-27T17:58:33+05:30 IST

టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల సవాళ్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత

విశాఖ: టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల సవాళ్లతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కుతోంది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వ్యాఖ్యలపై స్పందించిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఈస్ట్ పాయింట్ సాయిబాబా గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. 50 వాహనాల్లో తన అనుచరులతో కలిసి మరికాసేపట్లో సాయిబాబా ఆలయానికి చేరుకోనున్నారు. 


తనపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని ఆయన వస్తే ప్రమాణానికి సిద్ధమని వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. తన సవాళ్లు స్వీకరించకుండా ఇతరులతో మాట్లాడిస్తున్నారని వెలగపూడి మండిపడ్డారు. కాగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సాయిబాబా గుడికి వెళ్లే సమయంలో పార్టీ కార్యాలయంలో నిరసన తెలపాలని వెలగపూడి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు నిర్ణయించారు. రెండు పార్టీల నేతల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2020-12-27T17:58:33+05:30 IST